Moldtech: అమెరికా మార్కెట్లో మోల్డ్‌టెక్ విస్తరణ

అమెరికాకు కార్యకలాపాలను విస్తరించడానికి స్ట్రక్చరల్ డిజైన్, ఆర్కిటెక్చరల్ సర్వీసెస్, మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical Engineering) విభాగాల్లోని కంపెనీలను కొనుగోలు చేయాలని మోల్డ్‌టెక్ (Moldtech) టెక్నాలజీస్ భావిస్తోంది. సివిల్ (Civil) , మెకానికల్ విభాగాల్లో తగినన్ని ఆర్డర్లు ఉండడంతో పాటు సామర్థ్యాలను పెంచుకున్నందున వచ్చే త్రైమాసికాల్లో కంపెనీ పనితీరు బాగుంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ (June) తో ముగిసిన తొలి త్రైమాసికానికి మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ ఆదాయం 27 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే రూ.28.87 కోట్ల నుంచి రూ.36.68 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. నికర లాభం రూ.3.09 కోట్ల నుంచి రూ.6.28 కోట్లకు చేరింది.