యాపిల్ వినియోగదారులను హెచ్చరించిన కేంద్రం

యాపిల్ ఐఫోన్, ఐపాడ్, మాక్‌ను వినియోగించేవారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. హ్యాకర్లు అనుమతుల్లేకుండా ఫోన్లలోకి చొరబడి డేటాను అపహరించడంతోపాటు, ఫోన్‌ను వారి నియంత్రణలోకి తీసుకొనే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్`ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్పీ రెస్పాన్స్ టీమ్ అడ్వైజరీ జారీ చేసింది. యాపిల్ ఉత్పత్తుల్లో రెండు రకాల బలహీనతలను గుర్తించాము. వీటిని వాడుకొని సైబర్ అటాకర్స్ ఎక్స్‌ఎస్‌ఎస్ దాడులు చేసే అవకాశం ఉందని అని పేర్కొన్నారు.