గూగుల్ పేతో విదేశాల్లోనూ.. చెల్లింపులు

గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్‌తో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యూనిఫైడ్ పేమెంట్ సర్వీసెస్ (యూపీఐ) ద్వారా చెల్లింపుల సేవలను విదేశాలకు విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. అంటే, భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడా గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరిపేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా వెంట నగదు తీసుకెళ్లాల్సిన లేదా అంతర్జాతీయ పేమెంట్ గేట్‌వే లపై ఆధారపడాల్సి అవసరం తప్పుతుంది.