గూగుల్‌కు ఎదురుదెబ్బ … రూ.22,400 కోట్లు చెల్లించాల్సిందే

శోధనా ఫలితాల్లో ప్రత్యర్థుల కంటే, తన సొంత షాపింగ్ సిఫార్సులకు ప్రయోజనాన్ని అందించినందుకు గాను గూగుల్‌పై ఐరోపా సమాఖ్య (ఈయూ) భారీ జరిమానా విధించిన సంగతి విదితమే. దీనికి వ్యతిరేకంగా గూగుల్ తన చివరి చట్టపరమైన సవాలు అవకాశాన్ని కోల్పోయింది. 2017 నుంచి కొనసాగుతున్న యాంటీ ట్రస్ట్ కేసులో భారీ జరిమానాతో ఈయూ కోర్టు ముగింపు పలికింది. 27 దేశాల కూటమికి చెందిన అగ్రశ్రేణి యాంటీ ట్రస్ట్ ఎన్‌ఫోర్సర్ అయిన యూరోపియణ్ కమిషన్ విధించిన 2.4 బిలియన్ యూరోల ( 2.7 బిలియన్ డాలర్ల ` సుమారు రూ.22,400 కోట్లు) జరిమానాను గూగుల్ చెల్లించాలని ఈయూకు చెందిన కోర్ట్ ఆఫ్ జస్టిస్ తుది తీర్పు వెల్లడిరచింది. కంపెనీ దాఖలు చేసి దావాను తిరస్కరించి, దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. చాలా నిర్దిష్టమైన వాస్తవాలకు సంబంధించిన కోర్టు నిర్ణయంతో నిరాశ చెందామని గూగుల్ పేర్కొంది.