ఉద్యోగులకు గూగుల్ షాక్..

టెక్నాలజీ, డైవర్సిఫైడ్ దిగ్గజం గూగుల్ వ్యయ నియంత్రణల్లో భాగంగా లేఆఫ్ (ఉద్యోగాలలో కోత) అమలు చేస్తోంది. ప్రధానంగా హార్డ్‌వేర్, వాయిస్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ విభాగాలలో వందలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తోంది. అధిక ప్రాధాన్యమున్న విభాగాలలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు గూగుల్ పేర్కొంది. భారీ అవకాశాలు ముందున్నట్లు పేర్కొంది. కొన్ని టీములలో వ్యవస్థాగత మార్పులు చేపడుతున్నట్లు తెలియజేసింది. వెరసి కొన్ని వందల ఉద్యోగాలకు కోత పడుతున్నట్లు ప్రధానంగా ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్) హార్డ్‌వేర్ టీముల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు వివరించింది. ఏడాది క్రితం మొత్తం సిబ్బందిలో 6 శాతం వరకూ ( సుమారు 12,000 మంది ఉద్యోగులు) తొలగించనున్నట్లు గూగుల్ పేర్కొన్న విషయం విదితమే. గూగుల్‌తో పాటు మాతృ సంస్థ అల్ఫాబెట్ వ్యయాలను తగ్గించుకునే బాటలో ఉపాధి కల్పనకు షాకిస్తోంది.