Google: గూగుల్‌లో మరోసారి లేఆఫ్‌లు

కృత్రిమ మేధ అభివృద్ధిపై దృష్టి పెట్టిన టెక్ దిగ్గజం గూగుల్(Google) మరోసారి కంపెనీలో పునర్ వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మళ్లీ లేఆఫ్‌లు (Layoffs) ప్రకటించింది. సేల్స్ (Sales), పార్ట్‌నర్‌షిప్ (Partnership) విభాగాలను పర్యవేక్షించే తమ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (Global Business Organization) లో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. కస్టమ్లకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ చిన్న చిన్న సర్దుబాట్లు తప్పడం లేదని లేఆఫ్‌ల గురించి గూగుల్ వెల్లడిరచినట్లు తెలిసింది. నెల రోజుల వ్యవదిలో ఈ సంస్థ ఉద్యోగుల (Employees)ను తొలగించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.