సుందర్ పిచాయ్‌కు గూగుల్ షాక్
కరోనా సంక్షోభ కాలంలో టెక్ కార్పొరేట్ కంపెనీల సిఈఓల వేతనాలు భారీగా పెరగ్గా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఆ కంపెనీ 14 శాతం బోనస్‌ను తగ్గించిందని పైన్బోల్డ్ సంస్థ తెలిపింది. పిచాయ్ బోనస్ కోల్పోయినా స్టాక్ ప్యాకేజీ భారీగా దక్కించుకున్నారని పేర్కొంది. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం రూ.14 కోట్లు అందుకున్నారని తెలిపింది. దీనికి అదనంగా 2020, 2021 సంవత్సరాల్లో స్టాక్ ప్యాకేజీ కింద గూగుల్ నుంచి రూ.1707 కోట్లు పొందినట్లు తెలిపింది. కరోనా కాలంలో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థ బ్రాడ్‌కామ్ చీఫ్ తాన్ హాక్ ఎంగ్ ఆత్యధికంగా 158 శాతం బోనస్ పొందారు.






