గోల్డ్‌మ్యాన్ శాక్స్ లో ఎండీలకు ఉద్వాసన !
అమెరికాకు చెందిన బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్ గ్రూప్, అంతర్జాతీయంగా మేనేజింగ్ డైరెక్టర్ల (ఎండీల)తో పాటు కొందరు ఉద్యోగులనూ తొలగిస్తున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. కంపెనీలతో ఒప్పందాలు తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంతో పాటు మిగతా గ్రూప్ సంస్థల్లోని సుమారు 125 మంది ఎండీలను తొలగించబోతున్నట్లు సమాచారం. ఇంకా తొలగింపులు పూర్తిగా జరగలేదు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కనీసం 3 దశాల్లో ఉద్యోగులకు సంస్థ లేఆఫ్‌లు ప్రకటించబోతోంది. 2020, 2021లో గోల్మ్యాన్ శాక్స్‌తో పాటు ఇతర బ్యాంకులు భారీగా నియామకాలు జరిపాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోవడంతో కోతలకు దిగుతున్నాయి. అంతర్జాతీయంగా సలహాదారు సంస్థల్లో రెండో స్థానంలో ఉన్న గోల్డ్‌మ్యాన్ శాక్స్ ఒప్పందాల విలువ 40 శాతానికి పైగా తగ్గింది.






