ఈ గడియారానికి రూ.16.9 కోట్లు .. వేలంలో రికార్డు

టైటానిక్ ఓడ దుర్ఘటన సమయంలో 700 మందిని కాపాడిన కెప్టెన్ ఆర్థర్ రోస్ట్రన్‌కు కానుకగా వచ్చిన పాకెట్ గడియారం వేలంలో అనూహ్య ధర పలికింది. 18 క్యారట్ల బంగారంతో టీఫానీ అండ్ కో సంస్థ తయారు చేసిన ఈ గడియారాన్ని సుమారు 20 లక్షల డాలర్ల ( రూ.16.9 కోట్లు) కు ఓ అజ్ఞాత వ్యక్తి సొంతం చేసుకోవడం విశేషం. టైటానిక్ స్మృతులకు సంబంధించి వేలంలో అత్యధిక ధర పలికిన వస్తువు ఇదేనని నిర్వాహక సంస్థ హెన్రీ అల్డ్రిడ్జ్ అండ్ సన్ తెలిపింది.