Gland Pharma: గ్లాండ్ ఫార్మా ఔషధానికి ఎఫ్డీఏ అనుమతి

గ్లాకోమా సంబంధం కంటి సమస్య చికిత్సకు ఉపయోగపడే లాటనోప్రోస్ట్ ఆప్థాల్మిక్ సొల్యూషన్ ఔషధానికి అమెరికా ఎఫ్డీఏ (USFDA) అనుమతి లభించినట్లు గ్లాండ్ ఫార్మా (Gland Pharma) వెల్లడించింది. ఇది అప్ జాన్ సంస్థకు చెందిన జాలటాన్కి జనరిక్ వెర్షన్ అని తెలిపింది. తమ మార్కెటింగ్ భాగస్వాముల ద్వారా దీన్ని ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టే అవకాశమున్నట్టు కంపెనీ వివరించింది. 2023 డిసెంబర్కి ముందు ఏడాది వ్యవధిలో ఈ ఔషధం అమ్మకాలు దాదాపు 111.6 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.