బఫెట్‌ను మించిన అదానీ.. ప్రపంచ కుబేరుల్లో
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల తాజా జాబితా ప్రకారం అదానీ ఇప్పుడు ప్రపంచంలో 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు. అదానీ ఆస్తుల నికర విలువ 123.2 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ఆయన అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ 8వ స్థానంలో నిలిచారు.ఈ విధంగా చూస్తే ప్రపంచంలోనే టాప్ 10 ధనవంతుల్లో ఇద్దరు భరతీయులు ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతని మొత్తం ఆస్తుల విలువ 269.70 బిలియన్ డాలర్లుగా ఉంది. జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ అతని కుటుంబం నిరన ఆస్తుల విలువ 166.8 బిలియన్ డాలర్లుగా ఉండటంతో మూడో స్థానంలో నిలిచారు.






