ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీకి స్థానం
ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్ కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకారు. 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో గూగుల్ వ్యవస్థాపకులు లారీపేజ్, సెర్గీ బ్రిన్‌లను వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకెళ్లారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ప్రకారం ప్రపంచ కుబేరులా జాబితాలో అదానీ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్ ఎనర్జీ దేశంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. ఒకేరోజు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.65 వేల కోట్లు పెరిగింది. దీంతో గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.65 వేల కోట్లు పెరిగింది. దీంతో గౌతమ్ సంపద ఒక్కసారిగా పైకి ఎగబాకింది. లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు కొంత సంపద కోల్పోవడం కూడా గౌతమ్ అదానీ పైకి ఎగబాకడానికి కారణం అయ్యాయి. ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్స్ జాబితాలోనూ ఆరో స్థానంలో ఉండటం గమనార్హం.






