అదానీకి టోటల్ షాక్

అదానీ గ్రూప్ కంపెనీల్లో కొత్తగా ఎటువంటి పెట్టుబడులూ పెట్టబోమని ఫ్రెంచి ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్ ఎస్‌ఈ ప్రకటించింది. అమెరికాలో నమోదైన లంచం ఆరోపణల నుంచి అదానీ బయటపడే వరకు ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపింది. అమెరికా కేసు దర్యాప్తు వివరాలు తమకు తెలియవని వివరించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏఈజీఎల్), అదానీ టోటల్ గ్యాస్ ( ఏటీజీఎల్) లలో ఈ కంపెనీ గతంలో వాటాలు కొనుగోలు చేసింది.