భారత్ లో మరో భారీ పెట్టుబడి… రూ.416 కోట్లతో

తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారత్‌లో మరో రూ.461 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫాక్స్‌కాన్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ పెట్టుబడులు చొప్పించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. సింగపూర్‌లోని అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. ఒక్కో షేరును రూ.10 చొప్పున 46,08,76,736 షేర్లను సింగపూర్ ఫాక్స్‌కాన్ కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఫాక్స్‌కాన్ ప్రెసిషన్‌ను ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.