రూపాయి పడిపోలేదు… డాలరే బలపడ్డది!
డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ బలహీనపడుతుందడాన్ని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు. నిజానికి రూపాయి విలువ పడిపోవడం లేదని, డాలర్ విలువ పెరుగుతున్నందున తగ్గుతున్నట్టు అనిపిస్తోంది వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని, ఇతర దేశాలతో పోలిచ్చే ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. డాలర్ విలువ అడ్డులేకుండా పెరుగుతోందని అందువల్లనే రూపాయి బలహీనంగా కనిపిస్తోందని తెలిపారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి బలంగానే ఉందని అన్నారు.






