ఫెడరల్ అధికారులు కీలక నిర్ణయం…ప్రపంచవ్యాప్తంగా 171 నిలిపివేత

అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి బయలుదేరిన అలాస్కా విమానానికి గగనతలంలో తలుపు ఊడి, పెను ప్రమాదం తప్పిన ఘటన నేపథ్యంలో ఫెడరల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలు అన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా తక్షణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మొత్తం 171 విమానాలు ఆయా విమానాశ్రయాల్లో నిలిపియోయాయి.