అమెరికా వడ్డీ రేట్లు యథాతథమే

మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్, వరుసగా ఏడో సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 23 ఏళ్ల గరిష్ట స్తాయి అయిన 5.25-5.50 శాతం వద్దే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం వైపునకు చెలిస్తోందని గట్టి నమ్మకం కుదిరాకే, వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఫెడ్ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది ఒకసారి మాత్రమే వడ్డీరేట్ల కోతకు అవకాశం ఉందని సంకేతం ఇచ్చింది.