ఎస్ ఏపీ చైర్మన్ గా పునీత్ రంజన్!
భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, డెలాయిట్ గ్లోబల్ మాజీ సీఈవో పునీత్ రంజన్ జర్మనీకి చెందిన యూరోపియన్ బహుళజాతి సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ఏసీ ఎస్ఈ తదుపరి చైర్మన్గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఎస్ఏపీ సూపర్వైజరీ బోర్డు, ప్రస్తుత చైర్మన్ హాస్సో ప్లాట్నర్ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టేందుకు రంజన్ పేరు ప్రతిపాదించింది. సూపర్వైజరీ బోర్డులో కొత్త సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు రంజన్ నామినేషన్ వేయడంతో ప్లాట్నర్, సూపర్వైజరి బోర్డు వారసత్వ ప్రక్రియను ప్రారంభించారు. రంజన్ అనుభవం, గొప్ప అర్హతలు ఎస్ఏపీ సూపర్వైజరీ బోర్డులో ఆయన చేరి చైర్మన్గా బాధ్యతలు చేపట్టేందుకు తోడ్పడతాయని కంపెనీ వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ ఎస్ఏపీ ఎస్ఈ. కంపెనీ భవిష్యత్తును అంతర్జాతీయ వ్యాపారానికి అనుగుణంగా తీర్చి దిద్దుతామని రంజన్ వెల్లడిరచారు. డెలాయిట్ గ్లోబల్ సీఈవోగా రంజన్ 2015 నుంచి గత డిసెంబర్ 31 వరకు పని చేశారు.






