ప్రపంచంలో ఆ ఘనత సాధించనున్న తొలి వ్యక్తి

భారతీయ సంపన్నులలో తొలి డాలర్ ట్రిలియనీర్ రికార్డును అందుకునేది అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీయేనని ఓ తాజా నివేదిక అంచనా. 2028 కల్లా అదానీ సంపద ట్రిలియన్ డాలర్లను తాకుతుందని తెలిసింది. అదానీ వార్షిక సంపద సగటు వృద్ధిరేటు ప్రస్తుతమున్న 123 శాతం అలాగే కొనసాగితే అది సాధ్యమేనంటున్నది. అయితే ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న రిలయన్స్ ఇండ్రస్టీస్ అధిపతి ముకేశ్ అంబానీ ఈ ఫీట్‌ను ఆందుకోవడానికి 2033 కావచ్చనడం గమనార్హం. అందానీ సంపద విలువ 111 బిలియన్ డాలర్లు. అదానీ సంపద 99.6 బిలియన్ డాలర్లే. మరోవైపు ప్రపంచంలో తొలి డాలర్ ట్రిలయనీర్ ఘనతను సాధించేంది టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్కేనని ఈ రిపోర్టు చెప్పింది. 2027 కల్లా మస్క్ ఈ రికార్డును సొంతం చేసుకోవచ్చన్నది. మస్క్ సంపద 237 బిలియన్ డాలర్లుగా ఉన్నదిప్పుడు. 110 శాతం వార్షిక వృద్ధి నమోదవుతున్నది.