టెస్లా అధినేతి ఎలాన్ మస్క్… మరో కీలక నిర్ణయం
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్లో 9.2 శాతం వాటా కొనుగొలు చేశారు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ లకు పంపిన నోటిఫికేషన్లో ట్విట్టర్ ఈ సమాచారాన్ని వెల్లడిరచింది. ఈ వార్తల నేపథ్యంలో ప్రీ మార్కెట్ ట్రేడ్లో ట్విట్టర్ షేర్లు 28 శాతం వరకు పెరిగాయి. ఎలాన్ మస్క్ 2022, మార్చి 14 నాటికి ట్విట్టర్ ఇన్లో 9.2 శాతం నిష్క్రియాత్మక వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించారు. మాస్ 7,34,86,938 సాధారణ స్టాక్లను ఎలాన్ మస్క్ కలిగి ఉన్నాడని ట్విట్టర్ ఇన్ వెల్లడిరచింది. ఈ మధ్య ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.






