ట్విట్టర్ ఎలన్ మస్క్ పరం.. డీల్ రూ.3.3 లక్షల కోట్లు
ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్ అనుకున్న విధంగానే మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. మస్క్ ఆఫర్ చేసిన ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.3.30 లక్షల కోట్లు) ఒప్పందాన్ని ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సోషల్ మీడియా దిగ్గజ స్వాధీనానికి ఎలన్ నేరుగా వాటాదారులతో సంప్రదింపులు చేసి బోర్డు సభ్యులను ఒప్పించారు. వాక్ స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడానికే ట్విట్టర్‌ను టేక్‌వర్ చేయాలని భావించినట్లు ఎలన్‌మస్క్ తెలిపారు. సంస్థను అప్పగించడానికి ఆరు మాసాల సమయం పడుతుంనది ఆ సంస్థ చైర్మన్ బ్రెట్ టేలర్, సిఇఓ పరాగ్ అగర్వాల్ వెల్లడిరచారు.






