ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఔట్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో సమూల మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు బోర్డు సభ్యులు అందరిని తప్పించి ఎలాన్ మస్క్ పూర్తిగా కొత్త టీమ్‌ను తెచ్చుకుంటారని సమాచారం. టెస్లా చీఫ్ మస్క్ ఇటీవల ట్విటర్‌ను 4,400 కోట్ల డాలర్లకు కోనుగోలు చేశారు. కీలక స్థాయిలో మార్పులతో పాటు ఖర్చుల తగ్గింపుపైనా మాస్క్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ట్విటర్ ఉద్యోగుల్లో ఉద్యోగం ఉంటుందా? ఉన్నా ప్రస్తుత జీతాలు కొనసాగుతాయా? లేదా? అనే భయాలు ఏర్పడ్డాయి. కొత్త సీఈఓ, బోర్బు ఏర్పడే వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుందని భావిస్తున్నారు.






