ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన బెజోస్.. సంపన్నుల జాబితాలో

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కోల్పోయారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దక్కించుకున్నారు. గత తొమ్మిది నెలలుగా సంపన్నుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం జెఫ్ బెజోస్ సంపద విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక మస్క్ సంపద 198 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. మూడో స్థానంలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్ట్, నాలుగులో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఐదోలో బిల్ గేట్స్ ఉన్నారు.