కష్టపడండి.. లేకపోతే ఇంటికే
ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఉద్యోగులకు కంపెనీలో కొనసాగేందుకు 17వ తేదీ (గురువారం) వరకు గడువు వచ్చారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఇమెయిల్ పంపారు. విజయవంతమైన ట్విట్టర్ 2.0ని రూపొందించడానికి ఉద్యోగులు చాలా కస్టపడాల్సి ఉంటుందని, ఎక్కువ గంటలు పని, అధిక సామర్థ్యాన్ని చూపించవలసి ఉంటుందని మెయిల్లో పేర్కొన్నారు. అంతేకాదు కంపెనీలో భాగంగా ఉండాలనుకునే ఉద్యోగులందరూ ఇమెయిల్‌లో ఇచ్చిన లింక్‌పై అనువు పై క్లిక్ చేయాలని ఇమెయిల్‌లో తెలిపారు. ఎవరైనా సమాధానం ఇవ్వకపోతే, వారు మూడు నెలలపాటు తొలగింపు నోటీసు అందుకుంటారు. ఉద్యోగులు ఏ నిర్ణయం తీసుకున్నా, ట్విట్టర్‌ని విజయవంతం చేయడానికి చేసిన ప్రయత్నాలకు ధన్యవాదాలు అంటూ మస్క్ ఇమెయిల్‌లో రాశారు.






