ట్విట్టర్ వినియోగదారులకు ఎలాన్ మస్క్ షాక్
సామాజిక మాధ్యమం ట్విట్టర్ వినియోగదారులకు ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ గట్టి షాక్ ఇచ్చారు. వినియోగదారులు చదివే ట్వీట్లపై రోజు వారీ పరిమితి విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇకపై ట్వీట్లు, వ్యక్తుల ప్రొఫైల్ చూడాలంటే, తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సిందే. కొత్త నిబంధనల ప్రకారం.. ధ్రువీకరణ కలిగిన ఖాతా కలిగిన వారు రోజుకు 6,000 వరకు ట్వీట్లను, ధ్రువీకరణ లేని ఖాతాదార్లు రోజుకు 600 ట్వీట్ లను మాత్రమే చదివే విధంగా తాత్కాలికంగా ఆంక్షలు పెట్టారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ధ్రువీకరణ లేని ఖాతాదార్లు 800 పోస్ట్లు, ధ్రువీకరణ ఖాతా కలిగిన వారు 8,000 ట్వీట్లు చదువుకునేలా పరిమితిని పెంచారు. ఆ తర్వాత ఈ పరిమితిని 1,000, 10,000 ట్వీట్లు చేశారు.






