వచ్చే ఏడాది మార్కెట్ పతనం? : యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక

వచ్చే ఏడాది అమెరికన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనం కావచ్చని, అది 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో జరిగిన మార్కెట్ క్రాష్ కంటే దారుణంగా ఉండవచ్చని ఆ దేశ ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత హ్యారీ డెంట్ హెచ్చరించారు. ప్రస్తుతం యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద బుడగ (బబుల్) ఏర్పడుతోందని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎప్పుడైనా అది పేలవచ్చని డెంట్ అభిప్రాయపడ్డారు. రాబోయే మార్కెట్ క్రాష్‌లో ఎస్ అండ్ పీ సూచీ 86 శాతం, నాస్‌డాక్ 92 శాతం మేర క్షీణించవచ్చని అమెరికన్ స్టాక్ మార్కెట్ కొత్త హీరోగా అవతరించిన ఎన్ విడియా షేరు గరిష్ట స్థాయి నుంచి 98 శాతం మేర పతనం కావచ్చని డెంట్ అంచనా వేశారు. అమెరికా స్టాక్ సూచీలు కుప్పకూలితే భారత్ సహా ప్రపంచ మార్కెట్లూ భారీ పతనాన్ని చవిచూడాల్సి రావచ్చు.