భారతీయులకు ఐదేళ్ల వీసా

దుబాయ్ వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు మెరుగైన వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్లపాటు చెల్లుబాటు అయ్యే వీసాలను జారీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. దీంతో ఒకసారి వీసా తీసుకున్న భారత పర్యాటకులు ఎన్నిసార్లయినా దుబాయ్ వెళ్లిరావడానికి వెసులుబాటు కలుగుతుంది. దుబాయ్‌కు వచ్చిన తరువాత 90 రోజులపాటు ఉండవచ్చని, ఇలా ఏడాదిలో గరిష్ఠంగా 180 రోజులు ఉండడానికి అవకాశం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.