అమెరికా ఫార్మా కంపెనీని కొనుగోలు చేసిన డాక్టర్ రెడ్డీస్
అమెరికాకు చెందిన జనరిక్ ఫార్మా కంపెనీ మైనే ఫార్మా కంపెనీని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 45 కమర్షియల్ ఉత్పత్తులు, నాలుగు పైప్‌లైన్ ఉత్పత్తులు, 40 వరకు ఆమోదిత ఉత్పత్తులు ఉన్నాయి. మైనే ఫార్మా 2022, జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 111 మిలియన్ డాలర్లుగా ఉంది. పోర్టుఫోలియోలో విలువైన మందులు ఉన్నాయి. ఈ టేకోవర్ డీల్‌లో 90 మిలియన్ డాలర్లను నగదు రూపంలో, 15 మిలియన్ డాలర్లను క్రెడిట్ రూపంలో చెల్లించనుంది. ఈ కొనుగోలు ఉత్తర అమెరికా మార్కెట్లో కంపెనీ మరింత బలోపేతం అవుతుందని డాక్టర్ రెడ్డీస్ నార్త్ అమెరికా బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ కికుచి తెలిపారు.






