అమెరికా నుంచి డాక్టర్ రెడ్డీస్.. ఔషధం వెనక్కి

అవయవాల ట్రాన్‌ప్లాంటేషన్ అనంతర చికిత్సలో వినియోగించే జనరిక్ ఔషధాలను అమెరికా నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెనక్కి పిలిపిస్తోంది. ప్యాకేజింగ్ లోపాలే ఇందుకు కారణమని తెలిపింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రకారం 8,280 బాటిళ్ల టాక్రోవిమస్ క్యాప్సూల్స్‌ను డాక్టర్ రెడ్డీస్ రీకాల్ చేస్తోంది. 1 ఎంజీ టాక్రోలిమస్ క్యాప్సూల్ బాటిల్‌లో ఒక 0.5 ఎంజీ టాక్రోలిమస్ క్యాప్సూల్ లభించినట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో తెలిపింది. హైదరాబాద్ బాచుపల్లిలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్‌లో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేశారు. 2023 డిసెంబర్ 15న దేశవ్యాప్త ( అమెరికా) క్లాస్ 2 రీకాల్‌ను న్యూజెర్సీకి చెందిన డాక్టర్ రెడ్డీస్ శాఖ ప్రారంభించింది.