అమెరికాకు చెందిన ఇంజెనస్ తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం

క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్షన్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, అమెరికాకు చెందిన ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ ఎల్‌ఎల్‌సీతో డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఇంక్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజెనస్ ఉత్పత్తి చేసిన ఈ ఔషధాన్ని అమెరికాలో డాక్టర్ రెడ్డీస్ విక్రయించనుంది. 500 ఎంజీ/2.5 ఎంఎల్, 1జీ/5ఎంఎల్, 2జీ/10ఎంఎల్ మోతాదుల్లో ఈ ఔషధం అందుబాటులో ఉంటుంది. వచ్చిన లాభాల్లో 50 శాతాన్ని ఇంజెనస్‌కు చెల్లించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.