ఈక్యూఆర్ఎక్స్ తో ఆరిజెన్ ఒప్పందం
అమెరికాకు చెందిన ఈక్యూఆర్ఎక్స్ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు చెందిన ఆరిజెన్ డిస్కవరీ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కొత్త ఔషధాలను కనుగొనడం, ప్రీ క్లినికల్, క్లినికల్ పరీక్షల నిర్వహణ, వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెండు కంపెనీలు సహరించుకుంటాయి. నావెల్ థెరప్యుటికల్స్లో మరింత పట్టు సాధించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఆరిజెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురళీ రామ చంద్ర తెలిపారు. ఆరిజెన్ డిస్కవరీ టెక్నాలజీస్ క్లినికల్ దశలో ఉన్న బయోటెక్ కంపెనీ. డాక్టర్ రెడ్డీస్‌కు ఇది వంద శాతం అనుబంధ కంపెనీ.






