అమెరికా మార్కెట్ లో మరో ఔషధాన్ని విడుదల చేసిన రెడ్డీస్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఔషద సంస్థ డాక్టర్ రెడ్డీస్ అమెరికా మార్కెట్లో మరో ఔషధాన్ని విడుదల చేసింది. నసల్, సైనస్ల నుంచి ఉపశమనం పొందే ఔషధానికి జనరిక్ వెర్షన్ ఫెక్సోఫెనాడైన్ హెచ్సీ1 180 ఎంజీ, అక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సూడోపెడ్రిన్ హెచ్సీ1 240 ఎంజీ ట్యాబ్లెట్లను అక్కడి మార్కెట్లోకి విడుదల చేసింది. అవెంటి సబ్ ఎల్ఎల్సీ అలెగ్రా-డీ 24 హెచ్ఆర్కి ప్రత్యామ్నాయంగా విడుదల చేసిన ఈ ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతినిచ్చినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం అవెరికాలో ఈ ఔషధ మార్కెట్ 45 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది.






