డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు అమెరికా షాక్

ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు అమెరికా నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. హైదరాబాద్‌కు సమీపంలోని బొల్లారం వద్ద ఉన్న ప్లాంట్‌ను అమెరికా హెల్త్ రెగ్యులేటరీ తనిఖీ చేసి ఏడు అభ్యంతరాలతో ఫామ్ 484 జారీ చేసిందని సంస్థ బీఎస్‌ఈకీ సమాచారం అందించింది. బొల్లారం వద్ద ఏపీఏ తయారీ కేంద్రం ( సీటీవో`2)ను నవంబర్ 13 నుంచి 19 వరకు తనిఖీ చేశారు.