సంపన్నుల జాబితాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్

మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలాహారిస్‌లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్నుల జాబితాలో ట్రంప్ మరోసారి చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోని 500 మంది సంపన్నుల జాబితాలో ట్రంప్ 481వ స్థానంలో ఉన్నారు. సెప్టెంబరు చివరిలో ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్‌లోని ట్రూత్ సోషల్ మీడియా షేర్లు మూడు రెట్లు పెరిగాయి. దీంతో ఆయన సంపద 6.5 బిలియన్ డాలర్లకు పెరిగింది.