ఉద్యోగులకు వాల్ట్ డిస్నీ షాక్.. 7,000 మందిని
అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. దాదాపు 7,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు, వ్యూహాత్మక పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ సీఈవో బాబ్ ఇగర్ ప్రకటించారు. గత ఏడాది అక్టోబరు 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిస్నీలో పని చేస్తున్న 2.2 లక్షల మందిలో ఇది 3 శాతానికి సమానం. దాదాపు 550 కోట్ల డాలర్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇగర్ తెలిపారు. డిస్నీలో పని చేస్తున్న 2.20 లక్షల మందిలో 1.66 లక్షల మంది అమెరికాలో, 54,000 మంది విదేశాల్లో పని చేస్తున్నారు.






