మారడోనా జెర్సీ రికార్డు… వేలంలో రూ.70 కోట్లు
ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా 1986 ప్రపంచకప్లో అతడు ధరించిన ఓ జెర్సీ వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఇంగ్లాండ్తో క్వార్టర్ ఫైనల్ సందర్భాంగా వివాదాస్పద హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ కొట్టిన సమయంలో మారడోనా వేసుకున్న జెర్సీ రూ.70 కోట్లు (9.3 మిలియన్ డాలర్లు) పలికింది. క్రీడా స్మారకాల వేలంలో అత్యధిక ధర పలికిన రికార్డు మారడోనా జెర్సీకే దక్కింది. ఆధునిక ఒలింపిక్ మూమెంట్ మేనిఫెస్టో (8.8 మిలియన్ డాలర్లు) పేరిట ఉన్న రికార్డును అది తిరగరాసింది. మారడోనా చొక్కాను కొనుగోలు చేసిన వారి వివరాలను వెల్లడిరచలేదు. ఫుల్బాల్లో ఆల్టైమ్ గ్రేటెస్ట్ ఫ్లేయర్గా గుర్తింపు పొందిన మారడోనా 2020 నవంబరులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.






