ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూ.1.10 కోట్లు జరిమానా విదించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించనందున ఈ జరిమానా విధించినట్లు డీజీసీఏ తెలిపింది. సుదూర ప్రాంతాలు, కీలక మార్గాల్లో ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతాపరమైన నిబంధనలు పాటించడం లేదని సంస్థ ఉద్యోగి ఒకరు డీజీసీఏకి నివేదిక సమర్పించారు. లీజుకు తీసుకున్న విమానాల నిర్వహణ కూడా సరిగా చేపట్టడం లేదని అందులో ఆరోపించారు. దాని ఆధారంగా విచారణ జరిపిన డీజీసీఏ ప్రాథమిక దర్యాప్తులో నిబంధనలు అనుసరించడం లేదని నిర్ధారించి జరిమానా విదించడంతో పాటు షోకాజ్ జారీ చేసినట్లు వెల్లడించింది.