అమెరికా డ్రోన్లపై స్పందించిన భారత్.. ఇంకా
అమెరికా నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే అధునాతన డ్రోన్ల విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యుఎస్ డ్రోన్ల కొనుగోలు ధరలు ఇంకా ఖరారు కాలేదని, ధరలు నిర్ణయించారనే వార్తలు సరికాదని వివరణ ఇచ్చారు. అమెరికాకు చెందిన జనరల్ ఆటామిక్స్ రక్షణ సంస్థ ఈ డ్రోన్లను భారత్కు సమకూరుస్తోంది. ఈ సంస్థ ప్రతిపాదిత ధరలను ఇతర సంస్థల ధరలతో సరిపోల్చుకున్న తరువాతనే తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. 31 ఎంక్యూ బి డ్రోన్లను అమెరికా నుంచి తీసుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖ సంకల్పించింది. అందుబాటు ధర ఉంటేనే వీటిని తీసుకుంటారని రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.






