కాన్సెన్ట్రిక్స్ శుభవార్త…ఈ ఏడాది చివరి నాటికి
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ సొల్యుషన్ల సంస్థ కాన్సెన్ట్రిక్స్ కార్పొరేషన్ దేశంలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, కోల్‌కతాల్లో కాన్సెన్ట్రిక్స్కు కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో 2,500 మంది ఉద్యోగులుండగా, ఏడాది చివరి నాటికి వీరి సంఖ్య 5,000కు చేరుకుంటుందని సంస్థ వెల్లడించింది. మిడ్, సీనియర్ లెవల్ ఇంజినీర్లతో పాటు, ప్రాజెక్టు మేనేజర్లు, టెక్నికల్ ఆర్కిటెక్ట్‌లు తదితర ఉద్యోగాలతోపాటు టెలికాం, మీడియా, టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ తదితర విభాగాల్లో నియామకాలు ఉంటాయని కాన్సెన్ట్రిక్స్ క్యాటలిస్ట్ ప్రెసిడెంట్ దినేశ్ వేణుగోపాల్ తెలిపారు.






