అంచనాలను అందుకున్న కాగ్నిజెంట్
అమెరికా ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికంలో 563 మిలియన్ డాలర్ల లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన 505 మిలియన్ డాలర్ల లాభంతో పోలిస్తే ఇది 11.48 శాతం ఎక్కువ. డిజిటల్ ఆదాయంలో వృద్ధి ఇందుకు దోహదపడిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం 4.4 బిలియన్ డాలర్ల నుంచి 9.65 శాతం వృద్ధితో 4.82 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్లో క్యాంపస్ల నుంచి 50,000 మందికి పైగా ప్రెషర్లను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆశిస్తున్నట్లు వెల్లడిరచింది. మొదటి త్రైమాసికంలో స్థిర మారక రూపంలో ఆదాయం 10.9 శాతం పెరిగిందని, గత కొన్నేళ్ల చేపట్టిన వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇందుకు దోహదపడినట్లు కాగ్నిజంట్ సీఈవో బ్రయాన్ హంఫ్రీస్ తెలిపారు. కంపెనీ డిజిటల్ ఆదాయం 20 శాతం పెరిగింది.






