ఉద్యోగులకు సిస్కో షాక్.. 4 వేల మందికి!

టెక్ సంస్థల్లో ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. గతేడాది మాంద్యం భయాలతో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన ఆయ సంస్థలు, ఇప్పుడు ఏఐని అందుపుచ్చుకునే క్రమంలో ఉద్వాసనలు మొదలు పెట్టాయి. ఈ జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో సిస్టమ్స్ కూడా చేరింది. కంప్యూటర్ నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్‌లను తయారుచేసే ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 4 వేల మంది తొలగించాలని నిర్ణయించింది. 2023 నాటికి సిస్కోలో 85 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 5 శాతం ఉద్యోగులను తొలగించాలని కంపెనీ తాజాగా నిర్ణయించింది. టెల్కో, కేబుల్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఆశించిన స్థాయి డిమాండ్ లేకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.