America: అమెరికాకు చైనా షాక్

చైనాలోని కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమపై అమెరికా ఆంక్షలు విధించిన కొన్ని గంటల్లోనే బీజింగ్ (Beijing) తీవ్రంగా స్పందించింది. అరుదైన మూలకాలతో తయారుచేసే వస్తువును అమెరికా(America) కు ఎగుమతి చేయకూడదని బ్యాన్ విధించింది. ముఖ్యంగా సైనిక, పౌర అవసరాలకు వినియోగించే గాలియం, జెర్మెనియం, యాంటీమోనీ, సూపర్ హార్డ్ పదార్థాలకు ఈ నిషేధం వర్తించనుంది. ఇక గ్రాఫైట్ ఎగుమతుల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చైనా(China) వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. తమ దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడిరచింది. అమెరికా జాతీయ భద్రతను సాకుగా చూపి ఆర్థిక, వాణిజ్య, టెక్ అంశాలను ఆయుధాల వలే వాడుతోందని చైనా ఆరోపించింది.