చాట్ జీపీటీలో కొత్త ఫీచర్

ప్రముఖ కృత్రిమ మేధ చాట్‌బాట్ చాట్‌జీపీటి ప్లాట్‌ఫామ్‌లో ఓపెన్‌ఏఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. రీడ్ ఏ లాడ్ పేరిట వచ్చిన ఈ ఫీచర్ సమాధానాలను బయటకు పెద్దగా చదువుతుంది. ఫోన్ చూసి టెక్ట్స్ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వెబ్ వెర్షన్‌తో పాటు ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌లోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. రీడ్ ఏ లాడ్ ఫీచర్ జీపీటీ`4 జీపీటీ-3.5 మోడళ్లలోనూ పనిచేస్తుంది. మొత్తం 37భాషల్లోని టెక్ట్స్‌ను ఇది చదవగలదు. భాషను తనకు తానే గుర్తించగలుగుతుంది. మొబైల్ యాప్‌లలో టెక్ట్స్ పై క్లిక్ చేసి పట్టుకుంటే ఆప్షన్స్‌లో రీడ్ ఏ లౌడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకుంటే ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. వెబ్‌వెర్షన్‌లో చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానం కింద స్పీకర్ గుర్తు కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే సరిపోతుంది.