మెటా కు భారీ షాక్.. రూ.213 కోట్ల

మార్క్ జుకర్‌బర్గ్ ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా కు భారీ షాక్ తగిలింది. దాని అనుబంధ సంస్థ అయిన వాట్సాప్ ప్రైవసీ విధానం ద్వారా మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కారణంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెటా ప్లాట్‌ఫామ్‌కు భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.213.14 కోట్ల జరిమానా వేసింది. అయితే, సీసీఐ నిర్ణయంపై మెటా తాజా స్పందించింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. సీసీఐ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని తెలిపింది.