Donald Trump :అమెరికా బీటీఏపై జర జాగ్రత్త

డొనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ( బీటీఏ) కోసం అమెరికాతో జరుగుతున్న చర్చల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాన్ని నీతి ఆయోగ్ (NITI Aayog )కోరింది. దీనికి సంబంధించిన తన సూచనలతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. మన రైతాంగ జీవనోపాధికి కీలకమైన ఉత్పత్తులకు దిగుమతుల నుంచి రక్షణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. లేకపోతే దేశంలో వీటి ధరల స్థిరీకరణ కూడా కష్టమవుతుందని హెచ్చరించింది. అయితే అదే సమయంలో మన దేశంలో కొరతగా ఉన్న వంటనూనెలు, నూనె గింజలు (Oilseeds), పెద్దగా సాగు చేయని బాదం, పిస్తా (Pista) , అక్రోట్ వంటి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను జీరో లేదా తక్కువ దిగుమతి సుంకాలతో అనుమతించవచ్చని సూచించింది. అమెరికా పౌలీట్ర్ ఉత్పత్తులను మాత్రం జీరో డ్యూటీ (Zero duty) తో అనుమతించ వద్దని కోరింది. సుంకేతర అడ్డంకుల ( నాన్ టారిఫ్ బ్యారియర్స్) ద్వారానైనా ఈ దిగుమతులను అడ్డుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది.