అమెరికాలో బ్రైట్‌కామ్ రూ.765 కోట్ల పెట్టుబడులు
అమెరికాలో డిజిటల్ ఆడియో సేవలు అందించే ఒక కంపెనీ ఆస్తులను 102.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.765 కోట్ల)తో అక్కడి తమ నూతన వ్యాపార విభాగమైన బ్రైట్‌కామ్ ఆడియో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్రైట్‌కామ్ గ్రూపు (బీసీజీ) తెలిపింది. అమెరికా కంపెనీకి డిజిటల్ బ్రాండ్లు, డిజిటల్ మార్కెటింగ్ సేవలు, ప్రోగ్రామ్డ్ రేడియో స్టేషన్లకు సంబంధించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నందున డిజిటల్ ఆడియో ప్రకటనల్లోకి ప్రవేశించే అవకాశం తమకు లభిస్తుందని బీసీజీ వెల్లడిరచింది. 95 మిలియన్ డాలర్లను నగదుగా చెల్లించి 7.5 మిలియన్ డాలర్లకు బీజీసీ షేర్లు జారీ చేస్తారు. ఇందుకు తమకు ఏటా 45 మిలియన్ డాలర్ల ఆదాయం పెరుగుతుందని తెలిపింది.






