Mukesh Aghi : అమెరికా సుంకాలతో ఇరు దేశాలకూ నష్టమే : ముకేశ్ అఘి కీలక వ్యాఖ్యలు

భారత్‌పై అమెరికా సుంకాల వ్యవహారంలో అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) అధ్యక్షుడు, సీఈవో ముకేశ్ ఆఫీు(Mukesh Aghi) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా (America) విధించిన అసమంజసమైన సుంకాల వల్ల ఇరుదేశాలూ నష్టపోతున్నాయన్నారు. భారత్‌పై సెకండరీ టారిఫ్‌లను అనవసరమైనవిగా పేర్కొన్నాయి. అయితే, భారత్ విషయంలో అగ్రరాజ్యంలోని సీఈవోల స్పందన సానుకూలంగానే ఉందని, వారి విశ్వాసం ఎప్పటిలాగే కొనసాగుతోందన్నారు. వారు తమ పెట్టుబడులను తగ్గించడం లేదని తెలిపారు.
అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను సున్నాకు తగ్గించేందుకు భారత్(India) ముందుకొచ్చిందని ట్రంప్ చేసిన వాదనలపై ముకేశ్ మాట్లాడుతూ ట్రంప్ సోషల్ మీడియా (Social media) పోస్టుల్లో కొన్నింటిలో అసలు విషయమే ఉండకపోవచ్చన్నారు. ట్రంప్ పోస్టులపై భారత్ ఎప్పుడూ ప్రతికూలంగా స్పందించలేదు. ఆయన పోస్టులకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ట్రంప్ నోబెల్ బహుమతి (Nobel Prize) కోరుకుంటున్నారు. మరొకటి ఆయనకు తప్పుడు సలహాలు అందుతున్నాయి. భారత్ -అమెరికాల మధ్య గత 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన సంబంధాలు 25 గంటల్లోనే దెబ్బతింటున్నాయి. ఏదేమైనా ఇరుదేశాలు ఒకదానికొకటి అవసరం కాబట్టి నిబద్ధతతో ఉండటం ముఖ్యం అని వ్యాఖ్యానించారు.