బోయింగ్ ఉద్యోగుల సమ్మె

అమెరికాలోని సియాటల్ సమీపంలోని బోయింగ్ ఫ్యాక్టరీల్లో విమాన అసెంబ్లీంగ్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. వచ్చే నాలుగేళ్లలో వేతనాలు 25 శాతం పెరిగే విధంగా కంపెనీ రూపొందించిన తాత్కాలిక కాంట్రాక్ట్‌ను తిరస్కరించిన ఉద్యోగుల యూనియన్, సమ్మెకు మొగ్గుచూపింది.