Bitcoin: బిట్కాయన్ చరిత్రలోనే.. తొలిసారిగా

క్రిష్టోకరెన్సీ బిట్కాయిన్ విలువ చరిత్రలో తొలిసారిగా 1,00,000 డాలర్ల ఎగువకు చేరింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికయ్యాక, బిట్కాయిన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. గత నెల రోజుల్లో బిట్ కాయిన్ విలువ 40 శాతానికి పైగా పెరిగింది. క్రిప్టో కరెన్సీల విషయంలో ట్రంప్ వైఖరి సానుకూలంగా ఉండొచ్చనే అంచనాలే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్ ( సెక్) కొత్త అధ్యక్షుడిగా పాల్ అట్కిన్స్ (Paul Atkins) ను ఎంపిక చేయడం కూడా కారణమే. నవంబరు 5న అమెరికా ఎన్నికల రోజు 69,374 డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ జీవనకాల గరిష్ఠమైన 1,01,512 డాలర్లను తాకింది. 2022లో క్రిప్టో ఎక్స్ఛేంజీ ఎఫ్టీఎక్స్ సంక్షోభ ప్రభావంతో 17,000 డాలర్ల దిగువకు వచ్చిన ఈ క్రిప్టో కరెన్సీ ఆ తర్వాత రెండేళ్లలోనే లక్ష డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం.