ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్

అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్ చైర్మన్, సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా మారారు. టెస్లా కంపెనీ అధినేతెలాన్ మస్క్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో అర్నాల్ట్, ఆయన కుటుంబ నికర విలువ గత వారం 23.6 బిలియన్ డాలర్ల మేర పెరిగి 207.8 బి.డాలర్లకు చేరింది. ఇదే సమయంలో టెస్లా సీఈఓ నికర విలువ 204.7 బి. డాలర్లుగా ఉంది. దీంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు. భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ 104.4 బి. డాలర్లుగా ఫోర్బ్స్ నివేదిక అంచనా వేసింది. గౌతమ్ అదానీ 7.7 బి.డాలర్ల నికర విలువతో 16వ స్థానంలో సరిపెట్టుకున్నారు.